Friday, May 16, 2025
Homeసినిమాయూత్‌ఫుల్‌ రొమాంటిక్ 'వర్జిన్ బాయ్స్‌'

యూత్‌ఫుల్‌ రొమాంటిక్ ‘వర్జిన్ బాయ్స్‌’

- Advertisement -

గీతానంద్‌, మిత్రా శర్మ హీరో, హీరోయిన్లుగా, శ్రీహాన్‌, రోనీత్‌, జెన్నిఫర్‌, అన్షుల, సుజిత్‌ కుమార్‌, అభిలాష్‌లతో రూపొందిన యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘వర్జిన్‌ బాయ్స్‌’. దయానంద్‌ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదలైన టీజర్‌లో యూత్‌ఫుల్‌ వైబ్స్‌, కలర్‌ఫుల్‌ విజువల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్‌ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ని జోడించగా, వెంకట ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటింగ్‌ టీజర్‌ను క్రిస్పీగా మలిచింది. టీజర్‌లో గీతానంద్‌, మిత్రా శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. టీజర్‌ రిలీజ్‌ సందర్భంగా నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ, ‘ఈ సినిమా యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా తీర్చిదిద్దాం గతంలో ఎన్నో మంచి యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌లు వచ్చాయి. కానీ వాటిని మైమరిపించేలా ఈ సినిమా ఉంటుంది. రొటీన్‌కి భిన్నంగా ఉండే ఈ సినిమా కచ్చితంగా యూత్‌ని బాగా అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -