- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీరిశెట్టిపల్లి గ్రామ సమీపంలోని కాగ్నా నదిలో యాలాల మండలం అగనూరు గ్రామానికి చెందిన నర్సింహులు ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. వీరిశెట్టిపల్లి యువకులు శ్రవణ్, హరీశ్ కుమార్, శంకర్ అతడిని గమనించి, నదిలోకి దిగి, ఈదుకుంటూ నర్సింహులును మట్టిగడ్డపైకి చేర్చి, తాడు సహాయంతో ఒడ్డుకు తీసుకువచ్చి ప్రాణాలను కాపాడారు. యువకుల సాహసంతో నర్సింహులు సురక్షితంగా బయటపడ్డాడు.
- Advertisement -



