నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లో గుర్తింపు ఉండే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మద్నూర్ మండల సీనియర్ నాయకులు చౌలావర్ హన్మండ్లు స్వామి, విట్టల్ గురుజి, బాలు షిండే ,సంతోష్ మేస్త్రి, ఈరన్న, కల్లూరివార్ అశోక్, సుభాష్, బాలు యాదవ్, అయిడ్లవార్ హన్మండ్లు, యాదు, బండివార్ హన్మండ్లు, రచ్చ కుశాల్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.