నవతెలంగాణ – కామారెడ్డి
దివంగత మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా వైఎస్ఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి వైయస్సార్ అభిమాని మహమ్మద్ తాహెర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా మంగళవారం కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి పక్కన ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్నటువంటి పథకాలు ఈ రోజు కొనసాగుతున్నటువంటి పథకాలు, ఆరోజు పేదవారు పేదవారుగా ఉండకూడదన్న ఉద్దేశంతో పెద్ద జబ్బు వచ్చినా కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేసుకునే సదుపాయం కల్పించారన్నారు. ఆరోజు ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి మందులు ఇవ్వాలి.అనే ఉద్దేశంతో 104 సదుపాయాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. మహిళలకు పావుల వడ్డీ,ఒక రూపాయి కిలో బియ్యం, ఫీజు రెయిన్బర్మెంట్, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని నీ ఉద్దేశంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదవారికి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో ఆరోజు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన అటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సందర్భంగా గుర్తు చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తిని ఆ పథకాలన్నీ తెలుగు రెండు రాష్ట్రాలు అనుసరిస్తూ ఆరోగ్యశ్రీ,104 కొనసాగిస్తున్నారు. ఆయన నేటికీ చిరస్మరణీయుడు అన్నారు, ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా అయినా ప్రవేశపెట్టినటువంటి పథకాలుఅన్ని ఈ కార్యక్రమంలో వైయస్సార్ అభిమానులు జావీద్,పాండురంగం,అబ్దుల్ రషీద్,పెద్ద పోతంగల్ రాము,సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ చిరస్మరనీయుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES