Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘణంగా వైఎస్సార్ జయంతి వేడుకలు 

ఘణంగా వైఎస్సార్ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – పరకాల : మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను పరకాల పట్టణం‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ మాట్లాడుతూ.. మాజీ సీఎం వైయస్సార్ పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మడికొండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి, బొచ్చు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -