నవతెలంగాణ – జన్నారం: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో జన్నారం ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లకు బ్రెడ్, పండ్ల పంపిణీ చేశారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవ చేసిన సేవలను కొనియాడారు. పేదల గుండెల్లో నిలిచిన మహానేత రాజశేఖర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, గుర్రం మోహన్ రెడ్డి, మచ్చ శంకరయ్య, అజ్మీరా నందు నాయక్, మామిడిపల్లి ఇందయ్య, దాముక కరుణాకర్, గంగన్న యాదవ్, జిలకర గంగన్న, దుమల్ల ప్రవీణ్, కంప సుధీర్ కుమార్,గాజుల సత్తయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జన్నారంలో వైయస్సార్ జయంతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES