Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైయస్ఆర్ 76వ జయంతి దినోత్సవ వేడుకలు...

వైయస్ఆర్ 76వ జయంతి దినోత్సవ వేడుకలు…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : సంక్షేమ సారధి, రైతు బాంధవుడు, ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మాజీ సీఎం, డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా కిసాన్ నగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కనుకుంట్ల కొండల్ ఆధ్వర్యంలో  కార్యక్రమం నిర్వహించగా.. పలువురు హాజరై మాట్లాడారు. వైయస్సార్ ఆశయ సాధన కోసం యువజన కాంగ్రెస్ పక్షాన నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు చేగూరి బాలు, నాయకులు సాల్వేరు ఉపేందర్, పిట్టల వెంకటేష్, జమ్ముల కుమార్ యువజన కాంగ్రెస్ బోనిగిరి మండల ప్రధాన కార్యదర్శి అసద్, గొల్లపల్లి జానకిరామ్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -