Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లిలో ఘనంగా వైయస్సార్ వర్ధంతి వేడుకలు

కమ్మర్ పల్లిలో ఘనంగా వైయస్సార్ వర్ధంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద  దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి తీరనిలోటని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాటుపడాలన్నారు. పేదలకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యాన్ని, ఫీజు రియంబర్స్ మెంట్  ద్వారా ఉచితంగా కళాశాల విద్యను అందించడంతోపాటు 108 అంబులెన్స్ లను ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.

కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల బుజ్జి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, పూజారి శేఖర్, సింగిరెడ్డి శేఖర్, వేములవాడ జగదీష్, పాలెపు చిన్న గంగారం, పాలెపు రాజేశ్వర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad