నవతెలంగాణ – హైదరాబాద్ : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్ 1xBet కేసులో దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 43 ఏళ్ల యువీ తెలుపు రంగు టీషర్ట్, పాంట్‌లో ఈడీ ఆఫీసుకు వచ్చాడు. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఈడీ కార్యాలయానికి 12 గంటలకు చేరుకున్నాడు. తన లీగల్ బృందంతో యువీ ఈడీ ఆఫీసుకు వెళ్లాడు. మాజీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. పీఎంఎల్ఏ కేసులో యువీని ప్రశ్నించారు. ఇదే కేసులో ఇన్‌ఫ్లుయెన్సర్ అన్వేషి జైన్ కూడా ఇవాళ ఈడీ ముందు హాజరయ్యాడు.
ఈడీ ముందు హాజరైన యువరాజ్ సింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES