Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్కార్ట్‌ రక్షణతో క్యాంపునకు జహీరాబాద్‌ కౌన్సిలర్లు

ఎస్కార్ట్‌ రక్షణతో క్యాంపునకు జహీరాబాద్‌ కౌన్సిలర్లు

- Advertisement -

నవతెలంగాణ-జహీరాబాద్‌
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటాపోటీ మెజార్టీ రావడంతో ప్రధాన పార్టీలైన అధికార పార్టీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులను ప్రత్యేక వాహనాల్లో ఎస్కార్ట్‌ రక్షణతో క్యాంపునకు తరలించారు. కౌంటింగ్‌ హాల్‌ వద్ద గెలుపు ధ్రువీకరణ పత్రాలను తీసుకొని కౌన్సిలర్లు బయటికి వచ్చిన వెంటనే వారి అభిమానులు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు, ఎంఐఎం అభ్యర్థులను సైతం క్యాంపునకు తరలించేందుకు అధికార పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్‌ అభ్యర్థుల మద్దతుపైనే చైర్మెన్‌ ఎన్నిక జరగనుంది. అయితే, డీఎస్పీ సైదా నాయక్‌ సీఐ శివలింగంలో ఏ విధమైన అవాంఛనీయ ఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతల మధ్య కౌంటింగ్‌ హాల్‌ నుంచి కౌన్సిల్‌ అభ్యర్థులను బయటికి పంపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -