Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణకు శూన్యం.. కార్పొరేట్లకు వరం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

తెలంగాణకు శూన్యం.. కార్పొరేట్లకు వరం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ప్రజల ఆశలపై కేంద్ర బడ్జెట్‌ నీళ్లు చల్లిందనీ, కార్పొరేట్లకు వరాలు కురిపించేలా ఉందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వేల కోట్ల రూపాయల పన్నులు వెళ్తున్నప్పటికీ, తిరిగి నిధులు కేటాయించడంలో కేంద్రం మరోసారి తెలంగాణ పట్ల వివక్ష చూపిందని విమర్శించారు. విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర చట్టంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీలలో కోత విధించడం అన్యాయమని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం వల్ల నిత్యావసర ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే, యువతకు ఉపాధి కల్పించే నిర్దిష్ట ప్రణాళికలేవీ ఈ బడ్జెట్‌లో లేవని ఎత్తిచూపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -