Saturday, November 15, 2025
E-PAPER
Homeబీజినెస్ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1000 లోపు ఉత్పత్తులపై జీరో కమీషన్‌

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1000 లోపు ఉత్పత్తులపై జీరో కమీషన్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఇకపై రూ.1000 లోపు ధర కలిగిన అన్ని ఉత్పత్తుల జీరో కమీషన్‌ మోడల్‌ను అనుసరించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు హైపర్‌వాల్యూ ప్లాట్‌ఫాం షాప్సీకి కూడా వర్తిస్తుందని వెల్లడించింది. షాప్సీలో ధర ఎంతైనా అన్ని ఉత్పత్తులపై విక్రేతలపై జీరో కమీషన్‌ ఉంటుందని తెలిపింది. ఈ నిర్ణయం వల్ల విక్రేతాలకు భారం తగ్గడంతో పాటుగా కొనుగోలుదారులకు తక్కువ ధరలో ఉత్పత్తులు లభిస్తాయని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సకైత్‌ చౌధరి పేర్కొన్నారు. దేశ జీడీపీలో సుమారు 30 శాతం వాటా ఉన్న ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -