Thursday, January 8, 2026
E-PAPER
Homeబీజినెస్ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ నుంచి జీరో ఫారెక్స్‌ డైమాండ్‌ క్రెడిట్‌ కార్డు

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ నుంచి జీరో ఫారెక్స్‌ డైమాండ్‌ క్రెడిట్‌ కార్డు

- Advertisement -

హైదరాబాద్‌ : ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కొత్తగా జీరో ఫారెక్స్‌ డైమండ్‌ రిజర్వ్‌ క్రెడిట్‌ కార్డును విడుదల చేసినట్టు వెల్లడించింది. ఇది ప్రధానంగా సంపన్న అంతర్జాతీయ ప్రయాణికుల కోసం రూపొందించిన ఒక ప్రీమియం కార్డు అని పేర్కొంది. దీని ద్వారా జీరో ఫారెక్స్‌ మార్కప్‌, ట్రావెల్‌ లాంజ్‌లు, వేగవంతమైన ప్రయాణ రివార్డులు, ప్రీమియం జీవనశైలి ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది. ఈ కార్డుతో అంతర్జాతీయంగా చేసే అన్ని వ్యయాలపై 0 శాతం ఫారెక్స్‌ మార్కప్‌. యాప్‌ ద్వారా చేసే హోటల్‌ బుకింగ్‌లపై ప్రతి రూ.150కి 60 రివార్డ్‌ పాయింట్ల (రూ.15) వరకు అందిస్తుంది. విమాన బుకింగ్‌లపై ఖర్చు చేసే ప్రతి రూ.150కి 40 రివార్డ్‌ పాయింట్ల (రూ.10) వరకు ఆదా చేసుకోవచ్చని, ఇతర అనేక ఆకర్షణీయ ఫీచర్లున్నాయని ఆ సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -