Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటైం పాస్‌ కోసం జీరో అవర్‌-బీఆర్‌ఎస్‌ నేతలు

టైం పాస్‌ కోసం జీరో అవర్‌-బీఆర్‌ఎస్‌ నేతలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వం ఆసెంబ్లీలో టైం పాస్‌ కోసం జీరో అవర్‌ నడిపిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. ఆదివారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు, అసెంబ్లీలో డిప్యూటీ లీడర్లు టీ హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి తదితరుల సమక్షంలో ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే బాధ అనిపిస్తుందనీ, అసెంబ్లీకి రమ్మని పిలుస్తూ, మైక్‌ ఇవ్వకుండా ప్రతిపక్షం గొంతునొక్కేస్తున్నారని చెప్పారు. ఇల్లీగల్‌ మైనింగ్‌ పై హౌస్‌ కమిటీ వేసి విచారణ చెయ్యాలని డిమాండ్‌ చేశారు. మంత్రులను ప్రశ్నిస్తుంటే కులం ప్రస్తావన తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి అడిగితే అడిగితే కులం అంటగట్టడం ఏంటని ప్రశ్నించారు. కడియం శ్రీహరి అక్రమాలు నియోజకవర్గంలో అందరికి తెలుసు. ఆయన్ని అడ్డంపెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కాపాడే ప్రయత్నం సీఎం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌, అవినీతి వ్యవహారాలపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -