మార్కెట్లలో నిరాశపర్చిన రాబడి
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురి చేశాయి. గడిచిన ఏడాది కాలంలో రూపాయి లాభం లేకపోగా.. పైగా నష్టాలను చవి చూశారు. గడిచిన 12 నెలల్లో సెన్సెక్స్ నష్ట రాబడిని నమోదు చేసింది. ఇది ఇతర అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చినప్పుడు పేలవమైన ప్రదర్శన. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను సడలింపు, వడ్డీ రేట్ల తగ్గింపు, దేశీయ నిధుల ప్రవాహానికి తీసుకున్న అనుకూల విధానాలు మార్కెట్లను అలరించలేకపోయాయి. బలహీనమైన కార్పొరేట్ ఆదాయాలు, నిరంతర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం మార్కెట్ల నష్టాలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 2025లో ఇప్పటి వరకు రూ.1.4 లక్షల కోట్ల ఎఫ్‌ఐఐలు తరలిపోయాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డ్ స్థాయిలో 88కి పైగా పడిపోవడం సూచీలను నిరుత్సాహపర్చింది. గతేడాది సెప్టెంబర్‌లో సెన్సెక్స్ ఓ దశలో రికార్డ్ స్థాయిలో 86వేల చేరువలో నమోదయ్యింది. శుక్రవారం సెషన్‌లో 82,626 వద్ద ముగిసింది. ఏడాదిలో దాదాపు 2.27 శాతం నష్టపోయింది.
12 నెలల్లోసున్నా లాభం
- Advertisement -
- Advertisement -