నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో శనివారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలకు, భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయ్ ఫూలే జయంతి వేడుకలు పురస్కరించుకొని , శాలువాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య మాట్లాడుతూ సామాజిక మార్పును కోరుతూ తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన జ్యోతిభా పూలే భార్యగా, సావిత్రీ బాయ్ ఫూలే మహిళలకు చదువు పట్ల అవగాహన కలిగించి ఆ దిశగా చైతన్యం నింపి ఇప్పటికీ మనలో స్ఫూర్తిని కలిగిస్తున్న మహనీయురాలని అన్నారు. అంతకుముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాళ్ళు సుజారాణి,స్వర్ణలత,జ్ఞాన ప్రసూన,రాధిక,రోహిణి,శోభ, జ్యోత్స్న సన్మానం అందుకున్నారు. ఉపాధ్యాయులు పరమేశ్వర రావు,సైదులు,శంకరయ్య,దూడల వెంకటేష్,శ్రీధర్,మల్లేశం విద్యార్థులు పాల్గొన్నారు.



