Thursday, January 22, 2026
E-PAPER
Homeబీజినెస్జొమాటో సీఈఓ దీపిందర్‌ రాజీనామా

జొమాటో సీఈఓ దీపిందర్‌ రాజీనామా

- Advertisement -

బెంగళూరు : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ వేదిక జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ అనుహ్యంగా వైదోలిగారు. దీపిందర్‌ స్థానంలో బ్లింకిట్‌ సీఈఓగా ఉన్న అల్బీందర్‌ దిండ్సా బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుందని ఆ కంపెనీ రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఇక రోజువారీ కార్యకలాపాలు, నిర్వహణ ప్రాథమ్యాలు, వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను దిండ్సా తీసుకుంటారని దీపిందర్‌ తెలిపారు. 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం జొమాటో నికర లాభాలు 73 శాతం పెరిగి రూ.102 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.59 కోట్ల లాభాలు ఆర్జించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -