ఇంటాబయటా ప్రతిష్ట దిగజారిపోతున్న తరుణంలో ఏదోఒక భ్రమలోకి ప్రజలను తీసుకుపోవటం చేస్తుంటుంటాడు మన అబద్ధపు విశ్వగురువు. ఇదొక్కటికాదు, ఇంతకుముందు నాదసలు బయోలాజికల్ పుట్టుకనే కాదన్నాడు. ‘ఒక పనికోసం పరమాత్ముడు నన్ను పంపాడు’ అని మీడియాతోనే బహిరంగంగా చెప్పాడు. అంటే ప్రజలెన్నుకుని పంపినవాన్ని కాదనే కదా అర్థం. ఆ తర్వాత 2025లో సంపూర్ణ మెజారిటీ దక్కకపోపోయే సరికి, ‘నేను కూడా మనిషినే తప్పులు దొర్లుతుంటాయి’ అని మాట మార్చాడు.
మొన్న దేశంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మన మోడీ గారు ఎంపీగా గెలిచిన వారణాసిలో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఓట్లేసిన వారందరూ పట్టభద్రులు, మీడియా ఒక బీజేపీ నాయకుడిని ప్రశ్నించింది. ‘‘మీ ఓటమికి కారణ మేమిటని’’. అప్పుడా నాయకుడు ఏమన్నాడంటే, ‘‘ఓట్లేసిన వాళ్లందరూ చదువుకున్నవాళ్లు. సామాన్య ప్రజలు కాదు. అందుకే ఓడిపోయాం’’ అని సెలవిచ్చాడు. అంటే ఎంత చదువు రాకుంటే అంత లాభంగా ఉంటుంది వీళ్లకు. ప్రజల అజ్ఞానం, విజ్ఞాన రాహిత్యమే వీరికి పెట్టుబడి. మేల్కొంటే, విజ్ఞానులైతే వీళ్ల మాయలు ఆటకట్టే. అందుకనే ప్రజలను వాళ్లు గుడ్డిగా నమ్మేవాళ్లుగా ఉంచడం కోసం చాలా కథలు పడతారు. విజ్ఞాన శాస్త్రంతో ఎదిగిన సమాజాన్ని తలకిందులుగా చూపే ప్రయత్నం చేస్తారు. ఇంకా విషాదకరమంటే, సైన్సు సాంకేతికతను ఉపయోగించుకొని అజ్ఞానపు చర్యలకు, ప్రచారానికి పూనుకుంటారు. అందుకు ఉట్టి విశ్వగురు ఏ.ఐ. హోలోగ్రామ్ ద్వారా చిన్మయానంద స్వామితో జరిపిన సంభాషణ ఒక పెద్ద ఉదాహరణ.
1993లో చనిపోయిన చిన్మయానంద, ఈయన వి.హెచ్.పి. ప్రథమ అధ్యక్షులు. మొన్న మోడీ గారితో సంభాషించారు. చిన్మయ మిషన్ వాళ్లు ఏర్పాటు చేసిన ఈ ఏ.ఐ. ద్వారా మోడీ గారు మాట్లాడారు.‘93లో నేను కలిసిన ఒక వ్యక్తి నేడు దేశానికి నాయకుడుగా ఉన్నాడు’ అని ఆయన ప్రసంగం మొదలవుతుంది. 1993 నాటికి మోడీ అసలు ఎన్నికల ప్రక్రియలోనే లేడు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా కాదు. ‘‘నువ్వు చేపట్టిన పని నీ కోసం కాదు, మొత్తం దేశానిది, యువత అంతా నీతోనే ఉన్నారు. నేను చేయాల్సిన పనిని నువ్వు పూర్తి చేస్తున్నావు’’ అని స్వామి అంటే, ‘‘దేవా మీ అమూల్య మాట నాకు దైవ ప్రసాదం లాంటిదని ఈయన జవాబియ్యటం, ఇదంతా వీడియోగా ప్రసారమవుతోంది. భలే చిత్రంగా, ఆసక్తిగానూ గమ్మత్తుగానూ ఉంది సంభాషణ. దేశం మొత్తంలో యువత, విద్యార్థులు పెద్దయెత్తున ఉద్యమం చేస్తుంటే, మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు కదులుతున్న సందర్భంలో ముప్పయి మూడేండ్ల క్రితం మరణించిన స్వామిజీ ఏ.ఐ. రూపంలో వచ్చి పొగడ్తలు అందించడం చూస్తే, చచ్చినవాళ్లు తప్ప ఎవరూ పొగడని దీన పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి జిమ్మిక్కులు ఎన్నయినా సృష్టించగల దిట్టలు నేటి నేతలు. ఇంకా ఆ స్వామివారు సెలవిచ్చిన అంశమేమంటే, ‘‘మీరు చేపట్టిన ఆలయాల పునర్నిర్మాణం, విద్యావ్యవస్థలో పెద్ద మార్పు’’ అని పొగడటం. అసలు విద్యావ్యవస్థకూ ఈ ఆలయాల పునర్నిర్మాణానికి ఏమి సంబంధం? ఇంటాబయటా ప్రతిష్ట దిగజారిపోతున్న తరుణంలో ఏదోఒక భ్రమలోకి ప్రజలను తీసుకుపోవటం చేస్తుంటుంటాడు మన అబద్ధపు విశ్వగురువు. ఇదొక్కటికాదు, ఇంతకుముందు నాదసలు బయోలాజికల్ పుట్టుకనే కాదన్నాడు. ‘ఒక పనికోసం పరమాత్ముడు నన్ను పంపాడు’ అని మీడియాతోనే బహిరంగంగా చెప్పాడు. అంటే ప్రజలెన్నుకుని పంపినవాన్ని కాదనే కదా అర్థం. ఆ తర్వాత 2025లో సంపూర్ణ మెజారిటీ దక్కకపోపోయే సరికి, ‘నేను కూడా మనిషినే తప్పులు దొర్లుతుంటాయి’ అని మాట మార్చాడు. అసలు సాక్షాత్తూ సైంటిస్టుల సభలోనే మనిషి శరీరానికి ఏనుగు తలపెట్టిన గణపతి కథకు ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడో అయింది అనే ఘనతను చాటాడు.
ఇక చిన్న పిల్లలతో 1987లోనే నేను డిజిటల్ కెమెరాను ఉపయోగించి ఫొటో తీశానని ఎచ్చులు చెప్పాడు. 1995 వరకు డిజిటల్ కెమెరాలు‘భారత్’లోకి రాలేదు మరి! వీరికెలా దొరికింది!
1982లో గాంధీ సినిమా వచ్చేవరకు గాంధీ గురించి ప్రపంచానికి తెలియదని నిస్సిగ్గుగా తన అజ్ఞానాన్ని వెల్లడించిన మోడీ ఇంకా ఎన్నయినా ఇలాంటి పాఠాలను భోధిస్తూనే ఉంటాడు. వినేవాళ్లు ఉన్నంతకాలం. మోడీ ఎంతో మహత్తు గలవాడని, దేవుడని చుట్టూవున్న అంధభక్త శ్రేణులు చేస్తున్న హడావిడికి హద్దే లేకుండా పోయింది. ఇవేకాదు పూర్తి అబద్ధాలు, వ్యక్తి పూజలోని అనేక నేరేటివ్స్ను ప్రచారంలో పెడుతున్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 51 (ఎ) ప్రకారం శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాలని నిర్దేశించుకున్నాము. ఇలాంటి అశాస్త్రీయ అంశాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఒక దేశ ప్రధాని, ఇలాంటి ప్రచారాలకు ఒడిగట్టడం, దిగజారి పోయి వ్యవహరించడం సహించలేని విషయం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమలు కల్పించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.






కామెంట్లు (0)