Magazines

ప్రతిపక్షాల ఐక్యత దేశానికి వెన్నెముక కావాలి!

20 నిమిషాల క్రితం

backbone
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 6 నిమిషాల చదవడం

గత పన్నెండేండ్లలో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత పెద్దర్యాలీ దేశంలో ఎప్పుడూ జరగలేదు. 2026 నవంబర్ 1న ఢిల్లీ-రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో వామపక్షాలతో పాటు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కలిసి కట్టుగా ఒకే విషయాన్ని నినదించాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (అ)జ్ఞానేష్ కుమార్ కుట్రల కారణంగానే మోడీ ప్రధాని అయ్యాడు. అమిత్ షా హోంమంత్రి అయ్యాడు. వీళ్లు తప్పించుకుని ఎక్కడికీ పోలేరు. ఈ దేశ ప్రజలు వీరిని వదిలిపెట్టరు. తప్పక శిక్షిస్తారు- అని బాహాటంగా ప్రకటించారు. ఫారూఖ్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్‌‌తో పాటు వామపక్ష నేతలు వగైరాలంతా సోనియా, రాహుల్, ప్రియాంకలతో పాటు కలిసి పాల్గొన్నారు. ఈ ఐకమత్యం దేశానికి తప్పక మేలు చేకూరుస్తుంది.

తమకు ఎవరి మీదా కోపం, కక్షా లేవనీ, ఈ దేశ ప్రజల ఓటు హక్కును దొంగిలించారు గనకనే, తాము మాట్లాడవలసి వస్తోందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. కోట్లమంది దేశవాసుల ఓట్లు మాయమ య్యాయన్న ఆవేదనను వ్యక్తపరిచారు. కేవలం దేశంలో జరిగిన అన్యాయాల మీద మాత్రమే దృష్టి పెట్టి, ప్రతిపక్ష నేతలు మాట్లాడిన విషయాల సారాంశం ఈ విధంగా ఉంది. అధికారంలో ఉన్నవారిని ఏ మాత్రం దూషించ కుండా, చాలా హుందాగా మాట్లాడారు. *** ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ గొంతుకో కాదు. కేవలం రాజకీయ నేతల గొంతు కూడా కాదు. ఇది ఈ దేశంలోని యువతీ యువకుల గొంతు. రైతుల గొంతు. కష్టజీవుల గొంతు. మొత్తానికి మొత్తంగా ఇది ఈ దేశ ప్రజల గొంతు. ఈ దేశ రాజ్యాంగానికి దెబ్బతగలకుండా కాపాడుకునేందుకు ముందు కొచ్చిన ఈ దేశ పౌరుల గొంతు. ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందన్నది కాదు, ఎవరి దగ్గర ఎంత అధికారం ఉందన్నది కాదు. అన్నింటికన్నా ఈ దేశ రాజ్యాంగం గొప్పది. దేశ ప్రజల ఆకాంక్షలు గొప్పవి.

మనమందరం కలిసి వాటిని కాపాడుకో వాల్సిన తరుణం వచ్చింది. కేంద్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఓట్ చోరి జరిగింది. అన్ని సాక్ష్యాలూ, అన్ని ఆధారాలూ ముందుకొచ్చాయి. కొంతకాలంగా దేశంలోని మేధావులంతా వాటిని ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. బాధ్యత గల ప్రభుత్వం ఎప్పటికప్పుడు, ఎక్కడిక్కడ వివరణలివ్వాలి కదా? ఇవ్వలేదు. జవాబుదారీతనం లేని ప్రభుత్వాన్ని ఏమంటాం? నియంతల ప్రభుత్వం అంటాం! మన ప్రజాస్వామ్య దేశంలో నియంతల ప్రభుత్వం అవసరమా? అవసరం లేనప్పు డు దాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించి, పరిస్థితిని మనమే చక్కదిద్దు కోవాలి! ఆ పనిలో భాగంగానే ఊహించని రీతిలో ఈ దేశ పౌరులు రామ్ లీలా మైదాన్‌లో గుమిగూడారు. తమ హక్కులను దొంగిలించిన దొంగ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల తర్వాత దేశంలోని 13.5 కోట్ల మంది ఓట్లు మాయం చేసింది ఈ ఆరెస్సెస్, ‌బీజేపీ ప్రభుత్వం! అంటే, 130 మిలియన్ల మంది (అంటే అది ఈ దేశ జనాభాలో 15 శాతం) - మంది ఓటు హక్కు కోల్పోయారు.

ప్రజలు నాయకులను ఎన్నుకోవడం చూశాం కానీ, ఇక్కడ నాయకులు ప్రజలను ఎన్నుకుం టున్నారు. ఇది ఎప్పుడూ, ఎక్కడా లేని విచిత్రమైన పరిస్థితి. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘ఓట్ చోరి’ చేసి, దొంగతనంగా అధికారాన్ని ఆక్రమించింది. విష యాలన్నీ సామాన్య ప్రజలకు అర్థమయ్యాయి. అందుకే న్యాయం కావాలంటున్నారు. అక్రమ మార్గంలో ఎన్నికలు జరిపించిన జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయడమే కాదు, జైలుకు కూడా వెళతాడు. జ్ఞానేష్ కుమార్‌ను ఉపయోగించు కుని అధికారం దక్కించు కున్న మోడీ, అమిత్ షా వారి మంత్రి వర్గంలోని వారంతా దోషులే. ఎవరూ తప్పించుకుని పోలేరు. చేసిన దుర్మార్గాలకు శిక్షలు అనుభవిం చాల్సిందే! ఇది మామూలు దొంగతనం కాదు, పౌరుల ప్రాథమిక హక్కులు దొంగిలించడం. భావ ప్రకటనా స్వేచ్ఛను దొంగిలించడం. పౌరులు సజీవంగా సమాజంలో తిరుగుతున్నారు. కానీ, వారంతా చనిపోయిన వాళ్ల కిందే లెక్క! ఓటు హక్కు లాగేయడమంటే మాటలు కాదు. సజీవంగా ఉంచుతూనే హత్య చేయడం.


ఇది కూడా ఒకరకంగా గుజరాత్, మణిపూర్ మారణకాండ లాంటిదే- ఈ హత్యలకు పాల్పడింది మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్. వీరిని మించిన దేశద్రోహులు మరెవ్వరూ లేరు. ఆరెస్సెస్ ఈ దేశంలోని వ్యవస్థలన్నింటినీ అక్రమంగా ఆక్రమించుకుంది. గట్టిగా మాట్లాడితే అది ఈ దేశంలో ఒక రిజిష్టర్ కాని సంస్థ. దానికి లక్షల కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయీ? విద్యారంగం, వైద్యరంగం, సిబిఐ, ఈడి, న్యాయవ్యవస్థ, పోలీసు యంత్రాంగం, అధికారగణం - ఇవన్నీ ఎవరివీ? ఈ దేశ పౌరులవి! ఎవరి కోసం పనిచేయాలీ? ఈ దేశ ప్రజల కోసం పనిచేయాలి! కానీ, ఇవన్నీ అధికారంలో ఉన్న ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి. ఈ వ్యవస్థలన్నీ భవిష్యత్ తరాలవారివి. యువతకు వీటి మీద అధికారం ఉంది. కానీ, ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయీ? అన్యాయంగా వారిని అణచివేస్తున్నాయి. ఒకప్పుడు బ్రిటీషు వారు పీస్ బాండ్ల మీద సంతకాలు తీసుకుని ఈ దేశవాసుల్ని జైళ్లలో వేశారు.


ఈ ఆరెస్సెస్, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పనే చేస్తోంది. ఒకప్పుడు దేశ స్వాతంత్ర్యంలో ఏ మాత్రం పాల్గొనకుండా, బ్రిటీషు వారి బూట్లు శుభ్రం చేస్తూ దేశ ద్రోహులుగా మిగిలిపోయిన వీరు, ఇప్పుడు కూడా దేశ ద్రోహులు గానే ఉన్నారు. దేశప్రజల స్వేచ్ఛను దొంగిలించిన వీరు, దేశద్రోహులు కాకుండా దేశ ప్రేమికులు, దేశభక్తులు ఎలా కాగలరూ? వ్యవసాయ రంగానికి న్యాయం జరగడం లేదు. యువతకు ఉపాధిలేదు. విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు. కనీసం రోజుకూలీల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. మరి డబ్బంతా ఎటుపోతోంది? అదానీ, అంబానీలకు పోతోంది. వారికి వేల వేల కోట్ల రూపాయల రుణమాఫీ లభిస్తోంది. సామాన్యులు మాత్రం నరకయాతన పడాల్సి వస్తోంది. వారు కొద్దిపాటి బ్యాంకు రుణం తీర్చకపోతే, నిమిషంలో వారిని జైలుకు పంపిస్తున్నారు కదా? పెద్ద పెద్ద కార్పోరేట్లకు మాత్రం ఈ దేశంలో అన్నీ మాఫ్. వారు అన్నిరకాల కలలు కంటూ ఉండొచ్చు.

మోడీని అడ్డం పెట్టుకుని, దేశాన్ని కొంచెం కొంచెం ఆక్రమించు కుంటూ ఉండొచ్చు. ఈ దేశం నలుగురు గుజరాతీల చేతుల్లో ఉంది అని ఊరికే అనలేదు. ఇద్దరు దేశాన్ని అమ్ముతున్నారు. మరో ఇద్దరు కొంటున్నారు. దేశ ప్రజలేమో చిత్రహింసలకు గురి అవుతున్నారు. ఇలాంటి భారతదేశం మనకు అక్కరలేదు. నిరంతరం కష్టించి పనిచేస్తున్న రైతుకు శ్రమఫలితం దక్కనవసరం లేదా? రోజూ పద్దెనిమిది గంటలు కష్టపడి చదువు కుంటున్న విద్యార్థికి ఇంత జ్ఞానం సంపాదించుకునే అవకాశం అక్కరలేదా? చదువుపూర్తి చేసుకున్న వారికి ఓ ఉద్యోగం అక్కరలేదా? ఇవన్నీ గొంతెమ్మ కోర్కెలు కావు. తప్పనిసరిగా కావల్సినవి. ఈ ప్రభుత్వం వీటిమీద దృష్టిపెట్టడం లేదు. అదానీ, అంబానీలు దేశంలోని ఏయే వ్యవస్థల్ని ఆక్రమించుకోదలిస్తే వారు వాటిని ఆక్రమించు కుంటూ ఉండొచ్చు. వారి కలలు మాత్రమే నిజమవుతూ ఉండాలా? మిగతా కోట్లాది జనానికి కలలుకనే స్వేచ్ఛ లేదు. వాటిని నిజం చేసుకునే అవకాశాలు అంతకన్నా లేవు.

ఈ ప్రభుత్వం ఈ దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చిందీ? విద్యుత్ వ్యవస్థ అదానీది, మొబైల్ అదానీది, డ్రోన్ అదానీది, ఆయుధం అదానీది. మొత్తానికి మొత్తం దేశమంతా అదానీదేనా? ఇలాంటి దేశమా మనకు కావల్సిందీ? అక్కరలేదు - ఈ పరిస్థితిని మార్చుకో వడానికి మనమంతా అప్రమత్తతతో ఉండాలి. ప్రభుత్వ ప్రయత్నాల్ని అడ్డుకుంటూ ఉండాలి. ఈ దేశాన్ని మళ్లీ గాడిలో పడేయాలంటే, అది జ్ఞానేష్ కుమార్ రాజీనామాతో ప్రారంభం కావాలి! ‘‘నరేంద్ర మోడీ ఎక్కడికీ పోవడం లేదుకదా?’’ అని అమిత్ షా ప్రతిపక్షాల్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. అతను ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ప్రతిపక్షాలు కూడా ఎక్కడికీపోవడం లేదు. ఈ దేశప్రజలు కూడా ఎక్కడికీ పోవడం లేడు. ప్రస్తుత పరిస్థితుల నుంచి తప్పించు కోవడానికి మోడీ-షాలు ఎటైనా పారిపోవాలని ప్రయత్నిం చినా లాభం లేదు. ఈ దేశ ప్రజలు కాపలా కాస్తున్నారు. ప్రతిపక్షాలు కాపలా కాస్తు న్నాయి. యువత అంతా కాపలా కాస్తోంది. వీరు చేస్తూ వచ్చిన అరాచకాలకు ఈ దేశంలోనే శిక్ష అనుభవించక తప్పదు.

వారందరిమీద న్యాయ పరమైన, చట్టపరమైన చర్యలు ఉంటాయి. తప్పదు- దేశాన్ని కార్పోరేట్లకు అమ్మిన నేరానికి, ఓట్ చోరికి శిక్ష తప్పదు. ఆరెస్సెస్, బీజేపీ ఎక్కడెక్కడ విద్వేషం రెచ్చగొడుతూ వస్తోందో, అక్కడక్కడ ఈ దేశ పౌరులు ప్రేమను, సోదర భావాన్నీ పంచుతూ వస్తున్నారు. మాలో ఎవరికీ వ్యక్తిగతంగా ఎవరి మీదా ద్వేషభావం లేదు. హక్కులు దొంగిలించిన వారికి శిక్షపడాలని అంటున్నాం- అంతే! అదైనా ఎందుకం టున్నా మంటే - వీరు ఈ దేశపు ఆత్మమీద దాడ చేశారు. రాజ్యాంగం మీద దాడిచేశారు. ప్రజాస్వామ్యం మీద దాడిచేశారు. మతం - ధర్మం అంటూ పనికిరాని భాషణలిచ్చే నేతలు గుర్తుంచు కోవాల్సిన విషయం ఒకటుంది. ఈ దేశ ప్రజల గొంతులు స్వేచ్చగా పలకనివ్వడమే ధర్మం! ఈ ఆరెన్సెస్ - భారత రాజ్యాం గాన్ని వ్యతిరేకించింది. జాతీయ జెండాను తమ కార్యాలయం మీద ఎగరేసుకోలేదు. ఇప్పుడు యువకులు జాతీయ జెండా ఎగరేశారని జైల్లో వేశారు.

అదేమైనా నేరమా? ప్రజలు ఏం చెపుతున్నారో వినడం అధికారంలో ఉన్నవారి బాధ్యత! ప్రజల గొంతు శ్రద్ధగా వినగలిగేదే మంచి ప్రభుత్వం. వరుస క్రమంలో నిలబడ్డ చివరివ్యక్తి గొంతుకు కూడా విలువనివ్వాలి. అతను ఎవరైనా కావొచ్చు. అతని మతం, భాష, ప్రాంతం ఏదైనా కావొచ్చు- ఈ దేశ ప్రజలంతా గొంతెత్తి అరుస్తున్నారు. మాకు ద్వేషం అక్కరలేదు మహాప్రభో! మాకింత ఆదరణ కావాలని! కానీ, ఈ ప్రభుత్వం ఆవిషయమే పట్టించు కోవడం లేదు. ఈ పెద్ద ర్యాలీ విజయవంత మైంది గనుక మోడీ, షా, యోగి, జ్ఞానేష్ లకు ఇక నిద్ర కరువవు తుంది. నేరం చేశారు కాబట్టి, ఫలితం అనుభవించక తప్పదు - భారత రాజ్యాంగం బలపడాలి! ప్రజాస్వా మ్యం బలపడాలి! సమైక్యత బలపడాలి! సౌభ్రాతృత్వం బలపడాలి! దేశప్రజల ఆత్మస్థైర్యం బలపడాలి! ఈ దేశ ప్రజలు బలపడాలి? ఇదే విషయం మీద హిందీ కవి ఇమ్రాన్ ప్రతాప్‌ గారి కావితా పంక్తులు ఇక్కడ పొందుపరుస్తున్నాను - ఈ దేశ ప్రజల మనస్సులోని బలమైన భావనకు ఇవి ప్రతిరూపాలు- న మోదీ రహేంగే, నతో జ్ఞానేష్ రహేగా/ ఏ దేశ్ థా ఏ దేశ్ హై ఏదేశ్ రహేగా కబ్ తక్ తెర చోరీక జనాదేశ్‌ రహేగా!

ఏ దేశ్ థా ఏదేశాహై ఏ దేశా రహేగా నారా లగారహే హై సభీ జోర్‌ షోర్‌ సే/ సైలాబ్ కహా రుక్‌తాహై లాఠీ కె జోర్‌సే హద్ పార్ కీ హై జబ్బీ, నశేమే నిజామ్‌నే/ సారా నషా ఉతార్ దియా హై అవామ్‌నే హం జుల్మ్‌కె ఆగేన ఝకేహై, నఝకేంగే ఏ బాత్ చలో వక్త్ కి హిట్లర్ కొ బతాదే ఆహిస్త చలే, జ్యాద యహా తేజ్‌న బనే/ హాకిమ్ కొమష్వరాహై వో అంగ్‌రేజ్‌ న బనే ఉఠ్‌ దేఖ్ ఉఠా అప్ని నజర్ ఛోడ్ దియా హై/ అబ్ కిస్‌కొ డరాయేగ కె డర్ ఛోడ్ దియాహై దరియా భలేహొ ఆగ్‌క తౌరాక్‌ బహుత్ హై/ జిందాహై భగగ్‌సింగ్‌ అభీ అశ్ఫాఖ్ బహుత్‌ హై గాంధీక యహాఁ నెహ్రూక సందేశ్ రహేగా/ ఏ దేశ్‌థా ఏ దేశా హై ఏ దేశ్‌ రహేగా ​- కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.


ప్రొ. దేవరాజు మహారాజు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్