గలగల నవ్వుతూ, ఆడుతు పాడుతు చకచక కదిలే, పావురాలకు తరగతి గదిలో వెలుగులు కాస్తా ఆరిపోయి చీకటై పారుతున్న చదువుల నిలయమిపుడు రక్తపు మరకలతో భయంతో వణికిపోయే! గంజాయి మత్తులో కన్నుమిన్ను కానని మృగాడి క్రూరత్వపు చేతిలోని రంపపు కోతకు పసిపాప భవిష్యత్తు చెల్లా చెదిరిపోయింది. మత్తుముసుగుకు చిధ్రమాయె ప్రాణం చెల్లెలి రక్షణకు నిలిచిన స్నేహబంధం రుధిరమోడే. ఒకని రాక్షస కామాంధతకి, మరొకరి కలల పునాదులు నిలువునా కూలిపోయే! పాఠశాల ప్రశాంతతను చీల్చిన ఆ ముళ్ల గాయం ఎంతమంది గుండెల్లో మంటలాయెనో ఈ క్రూరత్వానికి సమాజం సమాధానమిచ్చేనా ఏం చెబుతాయో పెంచిన చేతులు మౌనం వహిస్తాయో, గుండెలవిసేలా రోదిస్తాయో చట్టం కత్తి పట్టి తీర్పు ఇచ్చినా మాయని మచ్చే మిగిలే, తరతరాలుగా కసాయి దాడికి బలిపశువైన బాల్యానికి ఎన్నడూ న్యాయం జరుగదు సుమా న్యాయం, చట్టం ఎవరికి వారు కండ్లగంతల తెల్ల శిల్పాలే సమాధి వద్దకు జోహార్లిడిచే కొవ్వత్తుల వెలుగు పుష్పాలే.
(రాపాడిన = మెత్తగా నూరిన ) - కపిల రాంకుమార్






కామెంట్లు (0)