Magazines

కజకిస్థాన్‌లో నయా షెడ్యూల్‌ షురూ..

58 నిమిషాల క్రితం

‘Release on January 12’
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

కథానాయకులు వెంకటేష్, కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్‌లైన్‌. తాజాగా చిత్ర బృందం కజకిస్థాన్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి యాక్షన్, పాటల కలయికతో ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో హీరోలిద్దరితో రెండు ప్రధాన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

స్టంట్ కొరియోగ్రాఫర్ రియల్ సతీష్ పర్య వేక్షణలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గురువారం పాల్గొన్నారు. కజకిస్థాన్‌లోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే యాక్షన్ బ్లాక్‌లో కనిపిస్తుండటంతో పాటు, అనిల్ రావిపూడి స్వయంగా ఈ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండటంతో ఇది సినిమాలో ప్రధాన హైలైట్స్‌లో ఒకటిగా నిలవనుంది. ఈ కజకిస్థాన్ షెడ్యూల్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటించే మరో గ్రాండ్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ ప్రత్యేక పాటను అందమైన లొకేషన్లలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్