Magazines

యూత్‌ కనెక్ట్‌ అవుతారు

1 గంట క్రితం

youth
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్’. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్, జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ఏషియన్‌ సినిమాస్‌ సమర్పణలో ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ తన సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు. నిర్మాత మట్లాడుతూ,‘సుడిగాలి సుధీర్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెతో నిర్మించిన చిత్రమిది. ఆయన క్రేజ్‌కు తగ్గ కథను ఎన్నుకుని ఈ సినిమా నిర్మించాను. ఆయన పాత్ర నేటి యువత కనెక్ట్‌ అవుతుంది. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నత స్థాయిలో ఉంటుంది.


ఇది సుధీర్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌ అంశాలతో సాగే ఈ సినిమాలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, నేపథ్య సంగీతం: మణిశర్మ, డీఓపీ: ర‌సూల్ ఎల్లోర్‌, ఎడిటర్‌: విజయ్‌ ముక్తవరపు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : రాజీవ్ నాయర్, కో ప్రొడ్యూస‌ర్‌: సమైరా రెడ్డి.ఎన్‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: ప్ర‌సూన మండ‌వ‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్