Tuesday, April 29, 2025
Homeసినిమాఅందరికీ కనెక్ట్‌ అయ్యే ఎమోషనల్‌ యాక్షన్‌ చిత్రం

అందరికీ కనెక్ట్‌ అయ్యే ఎమోషనల్‌ యాక్షన్‌ చిత్రం

‘కళ్యాణ్‌రామ్‌ అన్న ఈ సినిమా రిలీజ్‌ తర్వాత కాలర్‌ ఎగరేస్తాడు అని ఎన్టీఆర్‌ చెప్పారు. ఆయన సినిమా చూశారు. ఆ కాన్ఫిడెంట్‌తోనే అలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు’ అని దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి చెప్పారు. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. ఈ చిత్రంలో విజయశాంతి పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించ నున్నారు. అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ ప్రదీప్‌ చిలుకూరి మీడియాతో మాట్లాడుతూ,’తల్లి తండ్రులు మన బర్త్‌డేని ఒక సెలబ్రేషన్స్‌లా చేస్తారు. తల్లిదండ్రుల బర్త్‌ డేని మనం సెలబ్రేట్‌ చేయడం ఒక ఎమోషన్‌. అదే ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను. అయితే ఇందులో హీరో క్యారెక్టర్‌, మదర్‌ క్యారెక్టర్‌ ఎవరి ఐడియాలజీలో వాళ్ళు కరెక్ట్‌గా ఉంటారు. అక్కడి నుంచే కాన్‌ఫ్లిక్ట్‌ క్రియేట్‌ అవుతుంది. ఈ రెండు పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌. విజయశాంతి ఫైట్‌ సీక్వెన్స్‌ చాలా అద్భుతంగా చేశారు. ఈ చిత్రంలో తల్లి కోసం ఎంత త్యాగం చేయొచ్చు అనేది ఆడియన్స్‌ చూస్తారు. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సినిమా బిజినెస్‌ చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్‌ చాలా హ్యాపీగా ఉన్నారు. అజినీస్‌ ఇచ్చిన రెండు సాంగ్స్‌ చాలా బాగున్నాయి. రీ రికార్డింగ్‌ నెక్స్ట్‌ లెవెల్‌లో ఉంటుంది. సరికొత్త కళ్యాణ్‌రామ్‌ని చూస్తారు. నందమూరి అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఈ సినిమా నుంచి మంచి ఎమోషన్‌ని ఆశించవచ్చు. ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యే ఎమోషనల్‌ యాక్షన్‌ సినిమా’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img