Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్అంబేద్కర్ కు సీఎం రేవంత్ ఘన నివాళి

అంబేద్కర్ కు సీఎం రేవంత్ ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా.బీఆర్ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ చేసిన కృషిని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు ఆయన కృషిచేశారన్నారు. దూరదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని ఆదివారం ఓ ప్రకటనలో స్మరించుకున్నారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాల సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాధ్యం చేసింది రాజ్యాంగమేనని గుర్తుచేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad