– కర్ర శ్రీహరి పార్థివ దేహాన్ని సందర్శించి అంతిమయాత్రలో పాల్గొన్న పలువురు నాయకులు
నవతెలంగాణ-కోహెడ
అలుపెరుగని రాజకీయ శ్రామికుడు కర్ర శ్రీహరి అని పలువురు నాయకులు అన్నారు. శనివారం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ సర్పంచ్ కర్ర శ్రీహరిని పలువురు నాయకులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని, ఇలాంటి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన అంతమ యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వడ్లూరి లక్ష్మణ్, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, మాజీ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణారావు, తోట ఆగయ్య , పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అలుపెరుగని రాజకీయ శ్రామికుడు కర్ర శ్రీహరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES