Tuesday, April 7, 2026
E-PAPER
Homeక్రైమ్ఇసుక రవాణాపై నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు 

ఇసుక రవాణాపై నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు 

- Advertisement -

ఆన్ లైన్ పద్దతిలోనే  ఇసుక రవాణా జరగాలి

ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన నియంత్రణ

ఆన్లైన్ లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

 నవతెలంగాణ అచ్చంపేట : జిల్లావ్యాప్తంగా ఆన్లైన్ పద్ధతిలోని ఇసుక రవాణా జరగాలని ఇసుక రవాణాపై నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, వంగూరు మండలాల్లోని మొల్గర, పెదాపూర్, ఉల్పర గ్రామాల్లో కొనసాగుతున్న ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక తవ్వకం, తరలింపు విధానాలను పరిశీలించి, అక్కడి అధికారులతో పాటు ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఇసుక రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇసుకను తరలిస్తున్నదీ స్పష్టంగా నమోదు కావాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రాత్రి వేళలో తాను సీసీ కెమెరాల్లో రికార్డు పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు.  ఆన్లైన్ అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తవ్వకాలు లేదా రవాణా చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. అధికారులే నియమాలు ఉల్లంఘించినా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా ఇసుక పంపిణీ జరిగితే పారదర్శకత పెరిగి, అక్రమాలు తగ్గుతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్ ల నుండి ఇసుక అక్రమ రవాణా పై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఇసుక మన వాహనం ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

“మన ఇసుక – మన వాహనం” పోర్టల్‌లో నమోదు చేసుకున్న వాహనాలకు మాత్రమే ఇసుక రవాణా అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించిన కలెక్టర్, ప్రతి దశలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని ప్రజలకు అవసరమైన ఇసుక సులభంగా అందుబాటులోకి రావడంతో పాటు అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు.  జిల్లా కలెక్టర్ వెంట ఉప్పునుంతల, వంగూరు మండలాల రెవిన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -