Wednesday, May 21, 2025
Homeట్రెండింగ్ న్యూస్ఉస్మానియా వైద్యులను అభినందించిన సీఎం రేవంత్

ఉస్మానియా వైద్యులను అభినందించిన సీఎం రేవంత్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పేగు మార్పిడి ఆపరేషన్ ను విజయవంతం చేసినందుకు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. షార్ట్ గట్ సిండ్రోమ్ తో బాధపడుతున్న ఓ 40 ఏళ్ల వ్యక్తి ఎన్ని ఆస్పత్రులు తిరిగినా.. లాభం లేకపోవడంతో చివరగా ఉస్మానియా ఆస్పత్రిని సంప్రదించాడు. ఉస్మానియా ఆస్పత్రి వైద్య బృందం ఆ వ్యక్తికి శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చింది. దేశంలోనే తొలిసారిగా పేగుమార్పిడి ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించింది. ఈ ఆపరేషన్ ఒక్క తెలంగాణలోనే గాక యావత్ భారతదేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులలోని వైద్యరంగంలోనే మొట్టమొదటి విజయవంతమైన పేగు మార్పిడి ఆపరేషన్ గా నిలిచింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఈ చారిత్రాత్మక విజయం మన రాష్ట్రానికే కాదు.. దేశానికే గర్వకారణమని అన్నారు. అలాగే వైద్య బృందాన్ని అభినందించారు. అంకితభావం, నైపుణ్యంతో మానవాళికి విశిష్ట సేవందిస్తున్నందుకు వైద్య బృందాన్ని, సిబ్బందిని ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -