నవతెలంగాణ – హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐ) వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎ.శాంతికుమారి నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే శాంతకుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ అనంతరం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐ వైస్ ఛైర్‌పర్సన్‌గా శాంతికుమారి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈమెకు ఇదే సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -