మార్చి త్రైమాసికంలో 5.1 శాతం పతనం
న్యూఢిల్లీ : రోజవారి అవసరాల కోసం అత్యంత ఎక్కువగా ఉపయోగించే ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు మందగించాయి. ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో వీటి విక్రయాలు ఏకంగా 5.1 శాతం క్షీణించాయని నీల్సన్‌ఐక్యూ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. పానియాలు, కస్మోటిక్స్, ప్యాకేజింగ్ ఫుడ్, క్లీనింగ్ ఉత్పత్తులు, పెన్నులు, పెన్సిళ్లు తదితర ఉత్పత్తులు ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి వస్తాయి. తక్కువ విలువ కలిగి ఎక్కువగా అమ్ముడయ్యే ఈ ఉత్పత్తుల అమ్మకాలు 2024 ఇదే మార్చి త్రైమాసికంలో 6.1 శాతం వృద్ధిని సాధించాయి. గడిచిన ఐదు త్రైమాసికాల నుంచి వీటి వృద్ధి సన్నగిల్లిందని నీల్సన్ రిపోర్ట్ పేర్కొంది. గ్రామీణ మార్కెట్ పట్టణ మార్కెట్ కంటే వేగంగా వద్ధి చెందుతూనే ఉంది. ఈ మార్కెట్ పట్టణాల కంటే గ్రామీణంలో ఎక్కువగా పెరుగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ”2024 తొలి త్రైమాసికంలోని డిమాండ్‌తో పోల్చితే 2025 ప్రథమ త్రైమాసికంలో గ్రామీణ వినియోగదారుల డిమాండ్ స్వల్పంగా పెరిగింది. పట్టణ మార్కెట్లతో పోల్చితే గ్రామీణ మార్కెట్లే మెరుగ్గా ఉన్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుదల, మార్కెట్లలో మార్పుల వల్ల చిన్న సంస్థలు, ఆన్‌బ్రాండెడ్ సంస్థలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన మార్చి త్రైమాసికంలో అహార వినియోగ వృద్ధి 6 శాతం నుంచి 4.9 శాతానికి పడిపోయింది. గృహ, వ్యక్తిగత సంరక్షణ విభాగం అమ్మకాల్లో 5.7 శాతం పెరుగుదల చోటు చేసకుంది. అయితే.. గతేడాది మార్చి త్రైమాసికంలో 10.8 శాతం వృద్ధితో పోల్చితే చాలా తక్కువ.” అని నిల్సన్‌ఐక్యూ రిపోర్ట్ పేర్కొంది.
ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల్లో మందగింపు
- Advertisement -
- Advertisement -