Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఎస్బీఐలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఎస్బీఐలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -

– మానవీయంతో సేవలందించాలి : ఉద్యోగులకు సీజీఎం రాధాకృష్ణన్‌ సూచన
నవతెలంగాణ- హైదరాబాద్‌

ప్రభుత్వ రంగంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) హైదరాబాద్‌ లోకల్‌ హెడ్‌ ఆఫీస్‌ కోఠీలో 79వ భారత స్వాతంత్య్ర దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌ రాధాకృష్ణన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పరిశ్రమలు, సేవలు, విద్య, ఆరోగ్య రంగాలలో అభివృద్ధికి ఎస్బీఐ మూలస్తంబంగా నిలిచిందని రాధాకృష్ణన్‌ అన్నారు. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌లలో ఒకటిగా ఎస్బీఐ గుర్తింపును పొందిందని గుర్తుచేశారు. తెలంగాణ లో ఎస్బీఐ 60 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని జరుపుకుంటుంద న్నారు. వ్యాపారంలో ఈ ఏడాది ప్రతి జిల్లాలో 1శాతం మార్కెట్‌ వాటాను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు. ఈ లక్ష్య సాధనలో సీజీఎం నుంచి అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు ఐక్యంగా పని చేయాలని సూచించారు. ఎస్బీఐ సమగ్ర బ్యాంకింగ్‌ భావనను బలోపేతం చేయాల న్నారు. వినియోగదారుల పట్ల మానవీయ బాధ్య తతో మెలగాలని, సేవలందించాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ఈ కార్య క్రమంలో ఎస్బీఐ లేడిస్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ షేన్‌బాగ దేవి, జనరల్‌ మేనేజర్‌ (ఎస్‌డబ్ల్యూ-1) రవి కుమార్‌ వర్మ, ఎస్‌డబ్ల్యూ2 జీఎం సతీష్‌ కుమార్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు, ఇతర సీనియర్‌ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad