Wednesday, May 7, 2025
Homeరాష్ట్రీయంకన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కా

కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కా

- Advertisement -

– ఎన్ని అపవాదులు వచ్చినా జనం నా వెంటే : సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్‌:
ఓబుళాపురం మైనింగ్‌ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను నిర్దోషిగా ప్రకటించిన న్యాయ వ్యవస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసు విషయంలో పన్నెండున్నరేండ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఎన్ని అపవాదులు వచ్చినా తన నియోజకవర్గ ప్రజలు మాత్రం తనకు అండగా నిలిచారన్నారు. ఈ తీర్పు అనంతరం ఆమె కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ”ఏ తప్పూ చేయకపోయినా ఈ కేసులో నన్ను చేర్చడంపై బాధ పడ్డాను. న్యాయ వ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని నమ్మాను. ఈరోజు అదే జరిగింది. కానీ, ఇన్నేండ్లుగా నేను పడిన అవమానాలు, ప్రతిపక్షంలో ఉన్నవారు నన్ను అవినీతిపరురాలినని, జైలుకు పోతానని మాటలు అంటుంటే ఎంతో బాధపడ్డాను. అలా ప్రచారం చేసినా నా జిల్లా ప్రజలు, నియోజకవర్గం ప్రజలు నాపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచారు. ఎవరెన్ని మాట్లాడినా నమ్మకుండా నన్ను గెలిపిస్తూ వచ్చారు. ఇన్నేండ్లుగా నాతో పాటు ఉండి ధైర్యం చెప్పిన అందరికీ క ృతజ్ఞతలు” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -