Saturday, April 18, 2026
E-PAPER
Homeసినిమాగొప్ప వేడుకగా 'రా రా ధీవర' పాట

గొప్ప వేడుకగా ‘రా రా ధీవర’ పాట

- Advertisement -

హీరో నిఖిల్‌ సిద్ధార్థ ‘స్వయంభూ’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భరత్‌ కష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్‌ స్టూడియోస్‌ భువన్‌, శ్రీకర్‌ల నిర్మాణంలో, ఠాగూర్‌ మధు సమర్పణలో భారీ పీరియడ్‌ యాక్షన్‌ చిత్రంగా రూపొందుతోంది.
ఈ సినిమా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ ‘రా రా ధీవర’ అంచనాలను భారీగా పెంచింది. రవి బస్రూర్‌ సంగీతం అందిం చడంతో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఆయన ఆ అంచనాలను మించి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. పవర్‌ ఫుల్‌ డ్రమ్స్‌, ఆర్కెస్ట్రా లేయర్స్‌తో పాట ఒక యోధుడి నినాదంలా అనిపిస్తుంది. సంతోష్‌ వెంకీ వోకల్స్‌ పవర్‌ను మరింత పెంచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ధైర్యం, సంకల్పం, యోధుని ఆత్మను ప్రతిబింబిస్తాయి.
ఈ పాటలో నిఖిల్‌ తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్‌ అవతార్‌లో కనిపిస్తున్నారు. రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌, యుద్ధానికి సిద్ధమైన బాడీ లాంగ్వేజ్‌, ఖడ్గాలతో చేసే యాక్షన్‌ ఫైట్స్‌.. కఠిన సాధనను చూపిస్తున్నాయి. ఆయన చేసిన ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. హై ఎనర్జీ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో కూడా ఆకట్టుకుంటారు. నభా నటేశ్‌ ఈ పాటలో కనిపిస్తూ విజువల్‌ మరింత ఆకర్షణ తెచ్చారు. సినిమా గ్రాండియర్‌ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. కేకే సెంథిల్‌ కుమార్‌ అద్భుతమైన విజువల్స్‌తో భారీ సెట్లు, యుద్ధభూములు, యోధుల గుంపులను అద్భుతంగా చూపించారు. దర్శకుడు భరత్‌ కష్ణమాచారి తన విజన్‌ను భారీ స్థాయిలో ప్రజెంట్‌ చేశారు. యాక్షన్‌ సన్నివేశాలు, స్టేజింగ్‌,యు స్క్రీన్‌పై కనిపించే ఎనర్జీ అన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. విజే బిన్నీ మాస్టర్‌ కొరియోగ్రఫీ వార్‌ డ్యాన్స్‌ రిథమ్‌తో కలిపి ‘రా రా ధీవర’ను ఒక గొప్ప వేడుకగా నిలిచింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -