Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొర్రెలు మేకల పెంపకం దారుల మహసభ జయప్రదం చేయండి 

గొర్రెలు మేకల పెంపకం దారుల మహసభ జయప్రదం చేయండి 

- Advertisement -
  • – గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు గండ్రకోట కుమార్
  • నవతెలంగాణ -పరకాల 
  • గొర్రెలు మేకల పెంపకం దారుల మహాసభలను జయప్రదం చేయాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు గండ్రకోట కుమార్ పిలుపునిచ్చారు.మంగళవారం పరకాల మండలంలోని నాగారం గ్రామంలో జూలై 4న గొర్రెల మేకల పెంపకం దారుల మహాసభకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ గొర్రెలు మేకల పెంపకం దారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గొల్ల కురుమల ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. గొర్రెల, మేకల పెంపకం దారుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
  • గొర్రెలు మేకల పెంపకం దారుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక సంఘం జి ఎన్ పి ఎస్ మాత్రమే అన్నారు. కాబట్టి పరకాల ప్రాంతంలోని గొల్ల కురుమలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కాజీపేట రైల్వే స్టేషన్ నుండి మహాసభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూలై 4న ఉదయం 10 గంటలకు జరిగే ర్యాలీలో పాల్గొనడానికి గొల్ల కురుమలు డోలు ,గజ్జలతో అధిక సంఖ్యలో హాజరై మహాసభను జయప్రదం చేయాలన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా
    • ప్రముఖ ప్రజా కవి గాయకులు వరంగల్ శ్రీనివాస్, సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కిల్లె గోపాల్, ఉడుత.రవీందర్ హాజరవుతున్నట్లు వెల్లడించారు. కావున గొల్ల కురుమలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభ విజయవంతం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -