Saturday, February 28, 2026
E-PAPER
Homeఆటలుజార్జియా సెంచరీ

జార్జియా సెంచరీ

- Advertisement -

రెండో వన్డేలో ఆసీస్‌ అమ్మాయిల గెలుపు
హోబర్ట్‌ (ఆస్ట్రేలియా) :
ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్‌లో చతికిల పడింది. వరుసగా రెండో వన్డేలో ఓటమిపాలైన హర్మన్‌ప్రీత్‌ సేన మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌పై ఆశలు కోల్పోయింది. శుక్రవారం హోబర్ట్‌లో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి చెందింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అమ్మాయిలు 36.1 ఓవర్లలో ఛేదించింది. ఛేదనలో జార్జియా వోల్‌ (101, 82 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో మెరువగా, ఓపెనర్‌ లిచ్‌ఫీల్డ్‌ (80, 62 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో రాణించింది. మరో 83 బంతులు ఉండగానే ఆసీస్‌ అమ్మాయిలు లాంఛనం ముగించారు. అంతకముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత అమ్మాయిలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేశారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (54, 70 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రతికా రావల్‌ (52, 81 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరిశారు. స్మృతీ మంధాన (31), జెమీమా రొడ్రిగ్స్‌ (11), దీప్తి శర్మ (1), ఆమన్జోత్‌ కౌర్‌ (13) నిరాశపరిచారు. జార్జియా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆసీస్‌ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. నామమాత్రపు మూడో వన్డే ఆదివారం హోబర్ట్‌లోనే జరుగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -