Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టివి గూడెం రైతులకు ప్రజలకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి:భాస్కర్ రావు

టివి గూడెం రైతులకు ప్రజలకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి:భాస్కర్ రావు

- Advertisement -

నవతెలంగాణ – దామరచర్ల: దామరచర్ల మండలం లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి భూములు ఇచ్చిన తాళ్ళవీరప్పగూడెం రైతులు, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు డిమాండ్ చేశారు. మండలం లోని తాళ్ళ వీరప్పగూడెం గ్రామంలో రైతులు, యువకులతో సోమవారం జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్లాంటు నిర్మాణ ప్రతిపాదన వచ్చినప్పుడు నేను అప్పటి ఎమ్మెల్యేగా ముందుండి ఈ ప్రాంత నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి కల్పన, ఈ ప్రాంత అభివృద్ధి కొరుకు భూసేకరణ చేపట్టి ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా రైతులందరిని ఒప్పించి వారి సాగు భూములు ఇప్పించడం జరిగిందన్నారు.

ఒక గ్రామపంచాయతిని పూర్తిగా వారి భూములు, ఇళ్లు లు కూడా తీసుకొని ఖాళీ చేయించి ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద వారికి శాంతినగర్ గ్రామములో ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగా తాళ్ళవీరప్పగూడెం గ్రామములో ప్రధానంగా ప్రజలు , రైతులు ఆరోజు భూసేకరణకు అవాంతరం తెలిపితే అప్పటి విధ్యుత్ శాఖ మంత్రి  జగదీష్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లతో  స్వయంగా ఇక్కడి గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ప్లాంటు రావటం మూలాన మీ అందరికీ లాభం జరుగుతుంది, మీ పిల్లల భవ్యిషత్తు బాగుపడుతుందని చెప్పి భూసేకరణ చేయించినట్లు చెప్పారు.

కానీ ఇప్పటి పాలకులు ఇవేమీ తెలియకుండా ఏదో కొద్ది మందికి ఉద్యోగాలు కల్పించి మిగతా వారిని పట్టించవకోవటం లేదని ఆరోపించారు. అవసరమైతే ఒక ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు వెళ్తానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిసి ఈ ప్రాంత ప్రజలకు రావలసిన ప్రయోజనాల గూర్చి మాట్లాడనున్నట్లు చెప్పారు. ఆ రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చదాకా వదిలిపెట్టే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమములో  ఆర్ సైదులు.నారాయణరెడ్డి యూసుఫ్, హాతీరాం , సైదులు రెడ్డి,  సైది రెడ్డి, డి వెంకటేశ్వర్లు, కె సత్యనారాయణ,  నర్సయ్య,  సైదయ్య, గోవిందు తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -