నవతెలంగాణ-కమ్మర్ పల్లి
జిల్లా స్థాయి పీఎం శ్రీ స్పోర్ట్స్ మీట్ పోటీలలో భాగంగా కబడ్డీ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన పీఎంశ్రీ చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేర ఆంధ్రయ్య అభినందించారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగేష్ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి పీఎం శ్రీ స్పోర్ట్స్ మీట్ పోటీలలో ప్రథమ బహుమతి సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.అదేవిదంగా మంగళవారం జిల్లా స్థాయిలో జరిగిన స్పెల్ బి, క్విజ్ పోటీలలో సిహెచ్.మధుప్రియ ప్రథమ, ఎస్.ప్రణవి ద్వితీయ స్థానాలు సాధించారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా స్థాయి పీఎం శ్రీ స్పోర్ట్స్ మీట్ పోటీలలో భాగంగా కబడ్డీ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థులను, స్పెల్ బి, క్విజ్ పోటీలలో బహుమతులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించి, మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తొడ్పాడుతున్న ఉపాధ్యాయ బృందంకి కృతజ్ఞతలు తెలిపారు.
కబడ్డీలో ప్రథమ బహుమతి గెలుపొందిన విద్యార్థులకు అభినందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



