Wednesday, May 14, 2025
Homeజాతీయంప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో హైద‌రాబాద్ ఎస్ఐబీ ఆఫీస‌ర్‌ మృతి

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో హైద‌రాబాద్ ఎస్ఐబీ ఆఫీస‌ర్‌ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడిలో హైద‌రాబాద్ వాసి మ‌నీశ్ రంజ‌న్ మృతిచెందారు. ఆయ‌న కోఠిలోని స‌బ్సిడ‌రీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లో సెక్ష‌న్ ఆఫీస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. కుటుంబ‌స‌భ్యులతో క‌లిసి ప‌హ‌ల్గాం ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌గా ఉగ్ర‌వాదులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. భార్య‌, పిల్ల‌ల ఎదురుగానే ఆయ‌న‌ను కాల్చి చంపిన‌ట్లు స‌మాచారం. మ‌నీశ్ ఐడీ కార్డు చూసి మ‌రీ కాల్పులు జ‌రిపార‌ని తెలుస్తోంది. బీహార్‌కు చెందిన మ‌నీశ్‌… ఉద్యోగ రీత్యా హైద‌రాబాద్‌లో ఉంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -