నవతెలంగాణ – ఆర్మూర్
పెండింగ్లో ఉన్నఅమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలని మండల అభివృద్ధి అధికారి శివాజీ అన్నారు. పట్టణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ .. ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించడం జరిగింది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రాధనో ఉపాధ్యాయులకు సూచించారు. పంచాయతీరాజ్ ఏఈ నితీష్ మాట్లాడుతూ పనులు సత్వరంగా పూర్తి చేయడానికి ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నవీన్. హై స్కూల్ ప్రధానో ధ్యాయురాలు ,కవిత, ఇందిర, ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, అనసూయ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: ఎంపీడీవో శివాజీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES