రిమాండ్ కు తరలింపు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్హెచ్ఓ రఘుపతి సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెలితే.. 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కవిత కాంప్లెక్స్ లో పార్కింగ్ చేసిన వాహనాన్ని ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్లో షేక్ కరీం ముద్దిన్ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా తన ఫాసినో స్కూటీ నంబర్ టీఎస్16 ఈ కే 2626 బండిని మే రెండో తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు పార్కు చేసి కవిత కాంప్లెక్స్ లో వెళ్లి పని ముగించుకొని 15 నిమిషాల తర్వాత వచ్చి చూసే సరికి స్కూటీ కనిపించలేదు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆ స్కూటీపై వెళుతున్న వ్యక్తిని విచారించగా.. డిచ్పల్లి మండలం గన్ పూర్ గ్రామానికి చెందిన చౌహాన్ అర్జున్ దొంగతనానికి పాల్పడట్లు తెలిసింది. ఈ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచామని పోలీసులు తెలిపారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు.
బైక్ దొంగ అరెస్ట్ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES