Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుబోడుప్పల్ లో ఆక్రమణల కూల్చివేత..

బోడుప్పల్ లో ఆక్రమణల కూల్చివేత..

నవతెలంగాణ – హైదరాబాద్: బోడుప్పల్ లో రోడ్డు ఆక్రమణలపై మున్సిపల్ కమిషనర్ శైలజ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డును ఆక్రమించి కట్టిన గోడను బుల్డోజర్ తో కూల్చివేయించారు. అధికారుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ ఆర్ఎన్ఎస్ కాలనీలో ఓ రోడ్డును ఆక్రమించి విజన్ పీజీ కళాశాల యాజమాన్యం భవనం నిర్మించింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శైలజ స్పందించారు. కాలనీని పరిశీలించి రోడ్డు ఆక్రమణ నిజమేనని నిర్ధారించారు. పోలీసు బందోబస్తు మధ్య శుక్రవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కమిషనర్ శైలజ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img