Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

నవతెలంగాణ – హైదరాబాద్: మన దేశంలో బంగారం ధరలు సరికొత్త చరిత్రను లిఖించాయి. పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరడంతో, బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా లక్ష రూపాయల మార్కును దాటింది. ఈరోజు బులియన్ మార్కెట్ ట్రేడింగ్‌లో పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఈరోజు ఏకంగా రూ. 3,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో దీని ధర రూ. 1,01,350కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ. 2,750 పెరిగి, రూ. 92,900 వద్ద కొనసాగుతోంది. ఈ ధరల పెరుగుదల ఒక్కరోజులోనే నమోదు కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img