– నా పేరు చెప్పి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలే : మంత్రి పొంగులేటి
వరంగల్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీఏలుగా చెప్పుకొంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి, మచ్చ సురేశ్‌లుగా గుర్తించారు. దీనిపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు చెప్పి ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ” ఎవరైనా నా పీఏలమని ఫోన్ చేస్తే నా దష్టికి తీసుకురావాలి. నా కార్యాలయం 040-234561072/ 040-23451073కు ఫోన్ చేసి చెప్పాలి” అని తెలిపారు.
- Advertisement -