Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeసినిమామరిన్ని అవకాశాల కోసం..

మరిన్ని అవకాశాల కోసం..

- Advertisement -
Dill Raju

నిర్మాత, టీఎఫ్‌డీస్‌ చైర్మన్‌ దిల్‌ రాజు, నిర్మాత హర్షిత్‌ రెడ్డి ఇటీవల ఆస్ట్రేలియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ బృందంలో డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ స్టీవెన్‌ కానోలీ, వైస్‌ కాన్సుల్‌ హారియట్‌ వైట్‌, స్టెఫీ చెరియన్‌ ఉన్నారు. భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య ముఖ్యంగా సినిమా, సాంస్కతిక రంగాల్లో సంబం ధాలను ఎలా మరింత పటిష్టం చేసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇరు దేశాల మధ్య సినిమా సహ నిర్మాణాలు, సాంస్కతిక కార్యక్రమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల టాలెంట్‌ ఎక్సేంజ్‌ వంటి పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. హైదరాబాద్‌ నగరంపైన, తెలుగు సినిమాపైన ఆస్ట్రేలియా ప్రతినిధులు ఎంతో ఆసక్తి, ఉత్సాహం చూపించారు. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల సజనాత్మక రంగాల మధ్య బంధం మరింత బలపడుతుందని, ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఇరు పక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad