Tuesday, July 1, 2025
E-PAPER
Homeఆటలుముస్తాఫా, తన్మయ్ పసిడి ధమాకా

ముస్తాఫా, తన్మయ్ పసిడి ధమాకా

- Advertisement -

తెలంగాణ షుటింగ్‌ చాంపియన్‌షిప్స్‌
హైదరాబాద్‌ :
11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షుటింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో ముస్తాఫా ఖాన్‌, తన్మరు, ధవలిక దేవి పసిడి గురితో అదరగొట్టారు. ముస్తాఫా ఖాన్‌ పలు విభాగాల్లో కలిపి 5 పసిడి పతకాలు సాధించాడు. తన్మరు రారు 10మీ రైఫిల్‌ ఈవెంట్లలో ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు గెల్చుకోగా.. ధవలిక దేవి మహిళల విభాగంలో నాలుగు బంగారు పతకాలకు గురి పెట్టింది. విక్రాంత్‌ రాజ్‌ 10మీ రైఫిల్‌ ఈవెంట్స్‌లో ఓ స్వర్ణం, రెండు రజతాలు సాధించగా.. అక్షిత మహిళల 10మీ రైఫిల్‌ విభాగాల్లో మూడు పసిడి పతకాలు కొల్లగొట్టింది. ఎంపీ రఘువీర్‌ రెడ్డి, తెలంగాణ రైఫిల్‌ సంఘం అధ్యక్షుడు అమిత్‌ సంఘీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -