Wednesday, April 30, 2025
Homeజాతీయంమోడీ ప్ర‌భుత్వం విద్యావ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేస్తోంది: కేజ్రీవాల్

మోడీ ప్ర‌భుత్వం విద్యావ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేస్తోంది: కేజ్రీవాల్

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ బీజేపీ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. విద్యావ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేయాల‌ని మోడీ ప్ర‌భుత్వం చూస్తోంద‌ని ఆరోపించారు. గుజ‌రాత్ మోడ‌ల్ పేరుతో మోసం చేశార‌ని, దేశ‌వ్యాప్తంగా నిర‌క్ష‌రాస్య‌త‌ను పెంపొందించాల‌ని మోడీ స‌ర్కార్ కోరుకుంటున్నంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ‘మోడీ పాల‌న‌లో ఇదే గుజ‌రాత్ మోడ‌ల్‌, బీజేపీ మోడ‌ల్..ఇదే వారు దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయాలని చూస్తున్నారు. దేశంలో నిర‌క్ష‌రాస్య‌త‌ను పెంచాల‌ని డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ ప్ర‌యత్నిస్తుంది. ఏ రాష్ట్రంలో బీజేపీ పాల‌న‌లో ఉంటుందో..అక్క‌డ విద్యావ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు బీజేపీ పాల‌న‌లో ఉన్న ఢిల్లీలో కూడా విద్యా నాశ‌న‌మ‌కావ‌డానికి సిద్ధంగా ఉంది’ అని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే ఇటీవ‌ల విడుద‌లైన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 157 స్కూల్స్‌ల్లో ఒక్క‌రూ కూడా పాస్ కాలేద‌ని ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్ ఎక్స్ లో పోస్టు చేశారు. దాని ఉటంకియిస్తూ..బీజేపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు కేజ్రీవాల్. ఇటీవ‌ల స్కూల్ ఫీజులు ఆక‌స్మాత్తుగా పెంచార‌ని..ఢిల్లీలోని ప‌లు స్కూల్స్ ఎదుట విద్యార్థుల త‌ల్లిదండ్రులు ధ‌ర్నాలు చేశారు. స్కూల్ ఫీజులు పెంచిన స‌దురు పాఠ‌శాల‌ల యాజ‌మానుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిల్ల‌ల త‌ల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img