నవతెలంగాణ – ధర్మసాగర్
వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో పెన్షన్ దారులతో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్, వి హెచ్ పి ఎస్, సి పి హెచ్ పి ఎస్ కందుకూరి సోమన్న మాదిగ అనుబంధ సంఘాల అధ్యక్షతనమహాధర్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు రూ.6000/- మరియు చేయుత పెన్షన్ దారులకు రూ.4000/- వెంటనే పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు రూ.4000 /-నుండి రూ.6000,/-మరియు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీతా కార్మికులు బీడీ కార్మికులు చేయూత పెన్షన్ దారులకు రూ.2000/- నుండి రూ.4000 /-ఇస్తానని హామీనీ, ఇప్పటికి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం లోకి వచ్చి 22 నెలలు గడిచిపోయిన వారికి పెన్షన్ పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని విమర్శించారు.
అదేవిధంగా కండరాల క్షీణత కలిగిన వారికి రూ.15000 వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగ ఈ రోజు చేయూత పెన్షన్ దార్ల ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆధ్వర్యంలో ధర్మసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు పెన్షన్ దారులతో ధర్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనీ, తదనంతరం గ్రామపంచాయతీలో ఉన్నమండల ఎంపీడీవో గారికివినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో పెన్షన్ పెంచాలని అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము.పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలని తమరు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని మండలఎంపీడీవో గారిని కోరడం జరిగిందిఈ కార్యక్రమంలోచేయూత పెన్షన్ దారులైన నక్క ప్రమీల మాచర్ల బాబు గంట లక్ష్మి చిలక రాజు నక్క ప్రమీల నక్కరత్నం చింత దేవయ్య ఆరోగ్యం చిలుక శాంతమ్మ మరియుసోంపల్లి అన్వేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ ధర్మ రసాగర్ మండల అధ్యక్షుడు సింగారపు అన్వేష్ మాదిగ ధర్మసాగర్ మండలం ఉపాధ్యక్షులుచిలక రాజు ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
లబ్దిదారులకు వెంటనే పెన్షన్ పెంచాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES