షాకిచ్చిన మోడీ సర్కార్
గృహ వినియోగ సిలిండర్‌పై రూ.60
వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంపు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను భారీగా పెంచింది. ప్రజలపై భారీ భారం మోపింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.60, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌పై రూ.115 మేర ధరలు పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వంటగ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెరుగుదల భారం సాధారణ ప్రజలతో పాటు చిన్న వ్యాపారులు, హౌటళ్లు, రెస్టారెంట్లపై పడనున్నది.
పెరిగిన ధరల ప్రకారం.. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీ డొమెస్టిక్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.853 నుంచి రూ.913కు ఎగబాకనుంది. ముంబయిలో రూ.852.50 నుంచి రూ.912.50కు, కోల్‌కతాలో రూ.879 నుంచి రూ.930కి, చెన్నైలో రూ.868.50 నుంచి రూ.928.50కు ధరలు పెరగనున్నాయి. ఇక హైదరాబాద్‌లోనూ ఈ సిలిండర్‌పై రూ.60 పెరిగింది. ధర రూ.905 నుంచి 965కు ఎగబాకింది.
ఇక 19కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1768.50 నుంచి రూ.1883కు పెరగనున్నది. ఇది ముంబయిలో 1720.50 నుంచి రూ.1835కు, కోల్‌కతాలో రూ.1875.50 నుంచి రూ.1990కి, చెన్నైలో రూ.1929 నుంచి 2043.50కు చేరనున్నది. ఇక హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.2105.50కు చేరింది.
కాగా దేశంలో ఇంధన కొరత లేదనీ, సరఫరాలో అంతరాయాల గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో వెల్లడించారు. చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కూడా కేంద్రం అంటోంది. అయితే తాజా ధరల పెంపుతో కేంద్రం మాటలు నిజం కావని తేలిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.
వంటగ్యాస్ బాదుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



