– మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సామాజిక అవగాహన పెంచుకోవాలి
– ఐక్య ఉద్యమాలకు అండగా ఉంటా.. : తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రపంచం మారుతున్నదనీ, అనేక దేశాల్లో కార్మికులు, రైతులు, ఉద్యోగుల ప్రయోజనాలను కోరే ప్రభుత్వాలు వచ్చాయని జస్టిస్ చంద్ర కుమార్ తెలిపారు. ప్రజల ప్రయోజనాలను కోరే ప్రభుత్వాలను అక్కడి ప్రజలు తెచ్చుకున్నారని చెప్పారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్స్ జేఏసీ చైర్మెన్ కె.ఈశ్వర్ రావు అధ్యక్షతన బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడుతూ పోరాటం చట్టబద్ధంగా, ఐక్యంగా చేయాలని సూచించారు. సమస్త సంపదలను సృష్టిస్తున్న కార్మికులు, శ్రామికులు, పేదలు ఇంకా పేదలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టికర్తలకు ఆదాయంలో 10 శాతం వస్తుంటే యజమానులు 90శాతం తీసుకుంటున్నారనీ, దీని వల్లే సమాజంలో ఆర్థిక అసమానతలు న్నాయని వివరించారు. విద్య, వైద్యంలో ప్రయివేటీకరణ పెరిగి దోపిడీ పెరిగిందన్నారు. అనేక దేశాల్లో విద్యకు బడ్జెట్‌లో 20 నుంచి 25 శాతం కేటాయిస్తుండగా, మన దేశంలో కేవలం 2.5 శాతం వరకు మాత్రమే కేటాయిస్తున్నారని విమర్శించారు. దీంతో పేదరికం వల్ల చదువు కోలేనీ, చదువు కొనలేని, వైద్యం చేయించుకోలేని దుస్థితి దాపురించిందని తెలిపారు. రాజకీయ నాయకుల ప్రయివేటు విద్యాలయాలు, వైద్యశా లలు నడిచేందుకు ఉద్దేశపూర్వంగా ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమి కోసం కుట్రలు చేస్తుం టారన్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసేదే కానీ, బడ్జెట్ లేనందువల్ల కాదని తేల్చి చెప్పారు. ధరలు తగ్గించలేనీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరిం చలేని, ఉచిత విద్య, వైద్యం అందివ్వని, రైతు ఆత్మహత్యలను నివారించని, నాన్ పర్పార్మెన్స్ అసెట్స్ పేరుతో బడా పెట్టుబడీదారులకు రూ.14 లక్షల కోట్లను మాఫీ చేసి ప్రజల సొమ్మును కొల్లగొట్టిన పాలకులు ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థం చేసుకోవాలని కోరారు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉచిత విద్య, వైద్యం అమలవుతుంటే మన దేశంలో ఎందుకు కావడం లేదో తెలుసుకోవాలన్నారు. ఆర్టిజన్ల కన్వర్షన్ కోసం జరిగే చట్టబద్ధ ఐక్యపోరాటానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. కె.ఈశ్వర్ రావు మాట్లాడుతూ ఆర్టిజన్స్‌కు కన్వర్షన్ సాధిం చేంత వరకు పోరాటం కొనసాగు తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలో 20 వేల మంది ఆర్టిజన్లుగా పని చేస్తు న్నారనీ, 2017లో 23,667 మంది ఉండగా, కొంత మంది రిటైర్ అయ్యారని, మరికొంత మంది విధి నిర్వహణలో మరణించారన్నారు. ప్రమాదాలను నివారిం చడంలో యాజమాన్యం పూర్తిగా విఫల మైందని విమర్శించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు మాత్రమే వస్తుందనీ, 20 నుంచి 25 ఏండ్లు విధులు నిర్వహించిన కార్మికునికి చాలా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 వేల మంది ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1998లో విద్యుత్ సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను అబ్జర్స్ చేశారనీ, 2002లో విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ రెగ్యులైజేషన్ కోసం బి.పి.ఎం.ఎస్.నెం 36-37 విడుదల చేశారని తెలిపారు. 2006లో 7,114 సీజేఎల్‌ఎం పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, కాంట్రాక్ట్ కార్మికులతో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తే రద్దు చేసి, అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మకు లతో భర్తీ చేయించారని గుర్తుచేశారు. ఆర్టిజన్లకు ఉన్న విద్యార్హతల మేరకు జేఎల్‌ఎం, సబ్-ఇంజినీరింగ్, జూనియర్ అసిస్టెంట్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయాలని యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని కోరారు. కన్వర్షన్ సమస్యను పరిష్క రించకుంటే నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించారు. జిల్లా స్థాయి లో జేఏసీ సమావేశాలు నిర్వహించాలని సమా వేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లాల నాయ కులు పలువురు మాట్లాడారు. ఇతర సంఘాల నుంచి వచ్చిన పలువురు నాయకులు జేఏసీ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎం.ఏ.వజీర్, కో చైర్మెన్ జి.నాగరాజు, కో కన్వీనర్ కందికొండ వెంకటేశ్, జాయింట్ సెక్రెటరీలు ఎస్.చంద్రారెడ్డి, కె.లింగం, పి.మురళీ, కె.రఘు నాథరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు పి.కోటి గౌడ్, సలీం పాషా, మీడియా ఇన్‌ఛార్జి జె.ప్రసాద్ రాజు పాల్గొన్నారు.
సంపద సృష్టికర్తలు ఇంకా పేదరికంలోనే..
- Advertisement -
RELATED ARTICLES