Tuesday, May 20, 2025
Homeజాతీయంస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రానికి హెడ్గేవార్‌ పేరు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రానికి హెడ్గేవార్‌ పేరు

- Advertisement -

– కేరళలో డీవైఎఫ్‌ఐ, యూత్‌ కాంగ్రెస్‌ నిరసన
తిరువనంతపురం:
కేరళలోని పాలక్కాడ్‌లో గల నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు కె.బి హెడ్గేవార్‌ పేరు పెట్టడంపై వివాదం రాజుకుంది. వికలాంగుల కోసం నిర్మిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి శంకుస్థాపనను అడ్డుకున్న తర్వాత.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాహుల్‌ మమ్‌కుట్టాథిల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శనివారం బీజేపీ పాలక్కాడ్‌ జిల్లా అధ్యక్షుడిపై కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. వాస్తవానికి, కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌, డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎఫ్‌ఐ) కార్యకర్తలు పాలక్కాడ్‌ జిల్లాలో నిర్మిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడి పేరు పెట్టడాన్ని నిరసిస్తూ శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.పాలక్కాడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మమ్‌కుట్టాథిల్‌ను జిల్లాలో అడుగు పెట్టనివ్వబోమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వ్యాఖ్యానించగా.. ఈ మేరకు కాంగ్రెస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మమ్‌కుట్టాథిల్‌ స్పందిస్తూ.. తాను ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా తాను తన గళాన్ని విప్పుతానన్నారు. తన కాళ్లను నరికివేస్తే.. నా మిగిలిన శరీరాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఉపయోగిస్తానని వ్యాఖ్యానించారు.
నన్ను మాట్లాడకుండా ఆపాలంటే నా నాలుక కోసుకోవాల్సి వస్తుందన్నారు. బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తాను ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని.. బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కాదని.. ఈ బెదిరింపులు చేస్తున్న వారిపై కేరళ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉందన్నారు. కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో.. కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదనీ, దానికి ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడి పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పార్టీ నిరసనకు మమకుత్తిల్‌ నాయకత్వం వహించారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ బలమైన ఆందోళనను ప్రారంభిస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టుకు హెడ్గేవర్‌ పేరు పెట్టాలని నగర కౌన్సిల్‌లో ఎలాంటి ప్రతిపాదనను తీసుకురాలేదని.. దానికి వ్యతిరేకంగా చట్టపరమైన సహాయం తీసుకుంటామన్నారు. మరోవైపు, హెడ్గేవార్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ బీజేపీ.. పార్టీ జిల్లా కార్యాలయానికి ర్యాలీ నిర్వహించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -