Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ప్రతిష్ఠకు భూమిపూజ

అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ప్రతిష్ఠకు భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ-నాచారం 
ఎన్టీఆర్ నగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల స్థాపనకు దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలను త్వరలోనే ప్రతిష్ఠించి, ప్రారంభోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్, జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

మాజీ కార్పొరేటర్లు ప్రభుదాస్, గొల్లూరి అంజన్న మాట్లాడుతూ మహనీయుల ఆదర్శాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విగ్రహాల స్థాపన కార్యక్రమానికి భూమిపూజ జరగడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. విగ్రహ దాతలు యాడాల మల్లేష్, నల్ల బాబు మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలను బహుకరించే అవకాశం కల్పించిన దళిత సంక్షేమ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు వాసు చారి, ప్రధాన కార్యదర్శి మధు ముదిరాజు తమ కాలనీలో మహనీయుల విగ్రహాలు ప్రతిష్ఠించడం గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేవెళ్ల రమేష్, ఉపాధ్యక్షులు బొల్లారం యాదగిరి, కనక చంద్రం, ప్రధాన కార్యదర్శి గొల్లూరి సోములు తదితరులతో పాటు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ప్రజల్లో మరింత విస్తరించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -